Hero Allu Arjun Arrest Updates : చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ… జైలు నుంచి విడుదల కాలేదు. బెయిల్ పత్రాలు అందే విషయంలో ఆలస్యం కావటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రాత్రి తర్వాత ఆన్ లైన్ లో అర్డర్ కాపీ అప్ లోడ్ అయింది.