రిజనల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్), హైదరాబాద్ మెట్రో రెండో దశతో పాటు హైదరాబాద్, వరంగల్‌లలో సీవరేజీ, భూగర్భ డ్రైనేజీ ప్రణాళికలు, సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపు అంశాలపై కిషన్ రెడ్డితో.. రేవంత్ చర్చించారు. మొత్తం రూ.1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి సహకారం అందేలా చూడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.