పుష్ప2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు,ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలు పాలయ్యిన విషయం తెలిసిందే.ఇక ఈ సంఘటనలో పోలీసులు ఇప్పటికే థియేటర్ ఓనర్, మేనేజర్,అల్లుఅర్జున్(allu arjun)కి చెందిన బౌన్సర్లని అరెస్ట్ చేయగా రీసెంట్ గా అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చెయ్యడం జరిగింది.పైగా రిమాండ్ కి కూడా తరలించే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు విషయంపై తెలంగాణ మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్(ktr)సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ జాతీయ అవార్డు సాధించిన అల్లు అర్జున్ అరెస్ట్, పాలకుల అభద్రత భావానికి పరాకాష్ట. జరిగిన ఘటనకి నేరుగా బాధ్యుడు గాని అల్లు అర్జున్ ని సాధారణ నేరస్తుడిగా ట్రీట్  చెయ్యడం కరెక్ట్ కాదు.ప్రభుత్వ తీవ్ర చర్యని ఖండిస్తున్నాను.హైడ్రా చావులకి బాధ్యుడైన రేవంత్ రెడ్డి ని కూడా ఇదే లాజిక్ తో అరెస్ట్ చెయ్యాలని ట్వీట్ చెయ్యడం జరిగింది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here