గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమా రిలీజ్‌ అవ్వడానికి పూర్తిగా నెలరోజులు టైమ్‌ లేదు. ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్‌ పరంగా కొత్త పుంతలు తొక్కుతోంది యూనిట్‌. శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి హైప్‌ తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ అన్నిరకాల కృషి చేస్తోంది. అందులో భాగంగానే యు.ఎస్‌. ప్రీమియర్స్‌ గురించి ఒక ఇంట్రెస్టింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. 

జనవరి 9న యు.ఎస్‌.లో ప్రీమియర్స్‌ వెయ్యబోతున్నారు. దీనికి సంబంధించి బుక్సింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. దీన్ని ఓ సాధారణ ఎనౌన్స్‌మెంట్‌లా కాకుండా వినూత్న రీతిలో ఆ ప్రకటనను రిలీజ్‌ చేశారు. యు.ఎస్‌.లోని ఆర్‌సి యువశక్తి సభ్యులు ఈ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లో పాల్గొన్నారు. ఒక చాపర్‌ ఫ్లైట్‌లో ఆకాశంలోకి వెళ్లిన వీరు ‘గేమ్‌ ఛేంజర్‌ యుఎస్‌ ప్రీమియర్స్‌ బుకింగ్‌ ఓపెన్‌ టుడే’ అనే క్యాప్షన్‌ ఉన్న పోస్టర్‌ను పట్టుకొని ఫ్లైట్‌ నుంచి జంప్‌ చేశారు. ఒకరు ఈ పోస్టర్‌ను పట్టుకొని గాల్లో తేలుతుండగా మరొకరు దాన్ని కెమెరాలో క్యాప్చర్‌ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా అభిమానులు ఈ తరహా ప్రమోషన్‌తో థ్రిల్‌ అవుతున్నారు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here