‘ఛలో’తో సినీరంగ ప్రవేశం చేసిన కన్నడ భామ రష్మిక మందన్నాఆ తర్వాత గీత గోవిందం,భీష్మ,పుష్ప పార్ట్ 1 ,పార్ట్ 2 ,యానిమల్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా అవతరించింది. పుష్ప పార్ట్ 2 తో అయితే ఫస్ట్ టైం వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని సాధించిన సినిమాని కూడా తన ఖాతాలో వేసుకుంది.
రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కొంత మంది పుష్ప సిరీస్,యానిమల్ సినిమాల్లోని హీరో క్యారెక్టర్స్ మీద విమర్శలు చేస్తున్నారు.అలాంటి వాళ్లకి నేను చెప్పేది ఒక్కటే,ఏ సినిమాలో అయినా కథ ఆధారంగానే క్యారెక్టర్స్ ని ఎలివేట్ చెయ్యడం ఉంటుంది.అందుకే హీరో కోసం కథ రాసుకున్నప్పుడు హీరో ని ఎలివేట్ చేస్తారు.అదే హీరోయిన్ కోసం కథ రాసుకున్నప్పుడు హీరోయిన్ ని ఎలివేట్ చెయ్యడం జరుగుతుంది.క్యారెక్టర్స్ స్వభావాలు కూడా కథ ఆధారంగానే ఉంటాయి.మనుషులందరలో మంచి చెడు అనే రెండు గుణాలు ఉండటంతో పాటు ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసం కూడా వారి స్వభావం ఆధారంగానే ఉంటుందని చెప్పింది.మనందరం పీల్చే గాలి,తినే ఆహారం, తాగే నీళ్లు ఒక్కటే.కానీ ఇగోల వల్లే ఇద్దరి మనుషుల మధ్య వ్యత్యాసం వస్తుంది.అలాంటప్పుడు సినిమాల్లోని పాత్రలని నిందించడం తప్పు.పుష్ప రాజ్ లాంటి వ్యక్తులు సమాజంలో చాలా మంది ఉన్నారు.
నిజ జీవితంలో రెండు వందల మందిని చంపితే జైలులో ఉంటారు.అదే సినిమాలో హీరో చేస్తే ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కుబేర,ది గర్ల్ ఫ్రెండ్,చావా,రెయిన్ బో,సికందర్ వంటి క్రేజీ ప్రాజక్ట్స్ లో రష్మిక చేస్తుంది.