తారాగణం:వేదిక,అరవింద్ కృష్ణ,జయప్రకాశ్, పవిత్రా నరేష్,అనీష్ కురువిల్లా, షాయాజీషిండే, సాహితి దాసరి,సత్యకృష్ణ, తదితరులు 

సంగీతం: అనూప్ రూబెన్స్  

డీఓపీ: ఐ ఆండ్రు

రచన, ఎడిటింగ్,దర్శకత్వం:హరిత గోగినేని

నిర్మాతలు:ఏఆర్ అభి,వంకి పెంచలయ్య, 

బ్యానర్: దత్తాత్త్రేయ మీడియా 

విడుదల తేదీ: డిసెంబర్ 14 ,2024 

రూలర్,విజయదశమి,బాణం,కాంచన 3 ,బంగార్రాజు,రజాకార్ వంటి పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ, కన్నడ,హిందీ భాషల్లోను సినిమాలు చేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ వేదిక(vedhika)ఈ రోజు తనే  ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఫియర్'(fear)అనే సైకలాజికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. 

కథ

ఒక ఉన్నత కుటుంబానికి చెందిన సింధు( వేదిక) కొన్ని మానసిక సమస్యలకి గురి కావడంతో ఆమె తల్లి తండ్రులు(జయప్రకాష్, పవిత్ర)  సింధుని చికిత్స కోసం ఒక సైక్రియార్టిస్ట్(అనీష్ కురువిల్లా) దగ్గర జాయిన్ చేస్తారు.కానీ తన ప్రియుడు సంపత్ (అరవింద్ కృష్ణ) కోసం సింధు గొడవలు చేస్తూ ఉంటుంది. సింధు చెల్లెలు ఇందు(వేదిక) కూడా సింధు రూపంతోనే ఉంటుంది.ఇందు,సంపత్ లు సరదాగా తిరుగుతూ ఉంటారు.కానీ ఇందుని ఒక అజ్ఞాతవ్యక్తి వెంటపడుతుంటాడు.దీంతో ఇందు కూడా భయపడుతూ ఉంటుంది.ఇంకో పక్క సంపత్ విషయంలో సింధు గొడవని తట్టుకోలేని డాక్టర్ ఆమెతో అసలు సంపత్ లేడని చెప్తాడు. డాక్టర్ అలా ఎందుకు చెప్పాడు? సంపత్ కి ఏమైంది? సింధు,సంపత్ ప్రేమలో అంతకు ముందు ఏమైనా జరిగిందా? సింధుని భయపెడుతున్న వాళ్లెవరు? సంపత్, ఇందుఎందుకు హాస్పిటల్ కి రావడం లేదు? అసలు సింధు కి ఉన్నహెల్త్ ప్రాబ్లం ఏంటి? ఆ హెల్త్ ప్రాబ్లం సాల్వ్ అయ్యిందా? లేదా అనేదే ఈ కథ

ఎనాలసిస్ :

తెలుగులో సైకలాజికల్ థ్రిల్లర్స్ రావడం అనేది ఈ మధ్య కాలంలో తగ్గింది.అలాంటి టైం లో ఈ మూవీ వచ్చి,మళ్ళీ ఇలాంటి సినిమాలకి నాంది పలికిందని చెప్పవచ్చు.ఇక ఈ మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే పాయింట్ మంచిదే అయినా కూడా కథనాలు,క్యారెక్టర్ల తీరు తెన్నులు,డైలాగ్స్ అసలు ఏ మాత్రం బాగోలేదు.అసలు ఒక క్యారక్టర్ తన పాత్రకి తగ్గట్టుగా ఎలాంటి డైలాగులు చెప్పాలోరాసుకోకపోవడం చాలా ఆశ్చర్యం వేస్తుంది.బడ్జెట్ పరిమితికి లోబడి మంచి కథకి అన్యాయం చేశారనే విషయం కూడా సినిమా చూస్తున్నంత సేపు అనిపిస్తుంది.ఇక ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే కథ ప్రారంభమే సింధుని మానసిక వికలాంగుల హాస్పిటల్ లో చూపిస్తూ,అదే టైంలో ఆమె బాల్యంలో ఎదుర్కున్న సంఘటనలు చూపిస్తూ మంచి ఇంట్రెస్టింగ్ ని కలగ చేసారు.కానీ ఆ తర్వాత పస లేని సీన్స్ వచ్చి విసుగుని తెప్పిస్తాయి.పైగా మొదట్లోనే చెప్పుకున్నట్టు డైలాగులు ఆకట్టుకోలేకపోవడం వల్ల ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది.తన లవర్ సంపత్ కావాలంటూ సింధు గొడవ చేస్తుందే గాని,జైలు నుంచి బయటకి వెళ్ళడానికి ఎందుకు  ప్రయత్నం  చెయ్యదని మూవీ చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది.అలా కాకుండా ఆమె సంపత్ కోసం హాస్పిటల్ నుంచి పారిపోయి ఉంటే ఆ తర్వాత ఆమెకి ఎదురైన సంఘటనలకి, దర్శకురాలు అనుకున్న మెయిన్ పాయింట్ ని చూపిస్తే ఉంటే సినిమాకి వేరే లుక్ వచ్చేది.ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ నే నయం అనుకునేలా మరి ఇంకా బలహీనమైన సీన్స్ తో సాగింది.మరి ముఖ్యంగా డాక్టర్ గా చేసిన అనీష్ కురివెళ్లా,సింధు మధ్య సీన్స్ అయితే మరి దారుణంగా ఉన్నాయి.ఎంతో గ్రిప్ గా ఉండాల్సింది పోయి సింపుల్ గా రెండు మూడు డైలాగులతో తేల్చి పడేసారు.ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ లో ప్రేక్షకులు థ్రిల్లింగ్ ని ఫీల్ అవుతారు.కానీ అలాంటి థ్రిల్ మూమెంట్ ఒక్కటి కూడా ఉండకపోగా ఆర్ఆర్ కి స్క్రీన్ మీద క్యారక్టర్ భయపడటమేంటో అర్ధం కాదు.   

నటీనటులు,సాంకేతిక నిపుణల పనితీరు: 

సింధు,ఇందు క్యారెక్టర్స్ లో వేదిక ఒదిగిపోయి చేసి ప్రేక్షకుల నుంచి మార్కులే కొట్టివేసింది.ఆల్మోస్ట్ సినిమా మొత్తం కూడా తనే కనపడినా కూడా ప్రేక్షకులకి ఎక్కడా బోర్ కొట్టకుండా చెయ్యడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.ఇక మిగతా పాత్రల్లో చేసిన షాయాజీ షిండే, పవిత్ర, జయప్రకాశ్ ల నటనలో పెద్దగా మెరుపులేమి ఉండవు. ఇలాంటి క్యారెక్టర్స్ ని ఎప్పుడో చేసారు. అరవింద్ కృష్ణ కూడా తన క్యారక్టర్ వరకు బాగానే చేసాడు.అనీష్ కురువిళ్ళ కూడా డాక్టర్ క్యారక్టర్ కి బాగానే సూటయ్యాడు.చిన్న పిల్ల క్యారెక్టర్స్ లో చేసిన అమ్మాయి కూడా బాగానే నటించింది.ఇక దర్శకురాలే రచయిత కాబట్టి తను అనుకున్న కథని ప్రేక్షకులకి చెప్పడంలో బలమైన సీన్స్ ని రాసుకోలేకపోయింది.అనూప్ రూబెన్స్ ఆర్ ఆర్ ఒక్కటే సినిమా మొత్తం మీద బాగుంది. ఆండ్రు ఫొటోగ్రఫీ కూడా పర్లేదు

ఫైనల్ గా చెప్పాలంటే ఈ కథలో ఆశ్చర్యానికి గురిచేసే ట్విస్ట్ ఉన్నా కూడా అందుకు తగ్గట్టుగా కథనాలు, క్యారక్టర్ ల తీరు తెన్నులు,మాటలు సరిగా లేకపోవడం సినిమా విజయానికి మైనస్ గా పరిగణించే అవకాశాలు ఎక్కువ.

రేటింగ్ 2.5 / 5                                                                                                                                                                                                                                                                                అరుణాచలం 

       


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here