గిల్ కోసమే వచ్చిందంటూ సెటైర్లు
వర్షం కారణంగా తొలిరోజు ఆట నిలిచిన కాసేపటికే సారా టెండూల్కర్ బ్రిస్బేన్ స్టేడియానికి మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దాంతో నెటిజన్లు.. శుభమన్ గిల్ పేరుని తెరపైకి తెచ్చి.. ఇద్దరికీ ముడిపెడుతూ మీమ్స్ షేర్ చేశారు. గతంలో శుభమన్ గిల్, సారా టెండూల్కర్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.