Aadhaar card update: ఆధార్ కార్డులో ఉచితంగా మార్పులు చేసుకునే అవకాశాన్ని ఆధార్ జారీ సంస్థ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) లక్షలాది మంది ఆధార్ హోల్డర్లకు మరోసారి ఇచ్చింది. తమ ఆధార్ కార్డులో చిరునామా తదితర మార్పులను ఉచితంగా చేసుకునే సదుపాయాన్ని 2025 జూన్ 14 వరకు పొడిగించింది. ఉచిత అప్డేట్ గడువును మొదట జూన్ 14, 2024 వరకు నిర్ణయించారు. ఆ తరువాత ఆ గడువును సెప్టెంబర్ 14, 2024 వరకు పొడిగించారు. తరువాత డిసెంబర్ 14, 2024 వరకు పొడిగించారు. ఇప్పుడు 2025 జూన్ 14 వరకు పొడిగించారు.