డిసెంబర్ 5 న విడుదలైన అల్లుఅర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)కేవలం ఆరు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.దీంతో ఎండింగ్ టైంకి ఎంత ఫిగర్ సాధిస్తుందనే దాని మీద ఫిలిం సర్కిల్స్ లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.ఇక పుష్ప 2 ముఖ్యంగా హిందీ మార్కెట్ ని షేక్ చేస్తుందన్న విషయం తెలిసిందే.ఇప్పటికే హిందీ చిత్ర పరిశ్రమలో అక్కడి హీరోలకి కూడా సాధ్యం కానీ రీతిలో రికార్డు కలెక్షన్స్ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.
తాజాగా నిన్న శుక్రవారం ఒక్క రోజే 25 కోట్లని వసూలు చేసినట్టుగా తెలుస్తుంది.దీంతో హిందీకి సంబంధించి ఇప్పటి వరకు 461 కోట్ల షేర్ ని అందుకున్నట్టయ్యింది.మరి ఈ లెక్కన వీకెండ్ పూర్తయ్యే సరికి 500 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని హిందీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.దీంతో నార్త్ బెల్ట్ లో పుష్ప రాజ్ సరికొత్త సునామీని సృష్టించడం ఖాయమనే మాటలు వినపడుతున్నాయి.