“తెలంగాణకు జమిందారుల తల్లి కాదు. బహుజనుల తెలంగాణ తల్లి ఉండాలి. ఏ తల్లి అయితే మన అమ్మ లాగా ఉంటుందో, అడక్కుండానే మన ఆకలిని గుర్తించి బుక్కెడు అన్నం పెడుతుందో అలాంటి తెలంగాణ తల్లిని తెచ్చుకున్నాం. మన అమ్మకు ప్రతిరూపం. మన అక్కకు ప్రతిరూపం. ఒకపక్క వరి, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న వంటి తెలంగాణలో పండించే పంటతో పాటు నా బిడ్డలు చల్లంగా ఉండాలి. నా బిడ్డలు శాశ్వతంగా అభివృద్ధి పథంవైపు నడవాలని ఆశీర్వదించే తెలంగాణ తల్లిని మనం ప్రతిష్టించుకున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.