ప్రతిసారీ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టడం కాకుండా ఎంతో ముందుగానే పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్కూల్ యూనిఫామ్ బాధ్యతను రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగించామన్నారు. కుట్టు పనికి ఇచ్చే రుసుమును కూడా రూ.25 నుంచి రూ.75 కు పెంచామన్నారు. స్కూళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. వారంలో రెండు మూడు రోజులు రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించామని చెప్పారు.