మరోవైపు ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై ‘సిట్’ ఏర్పాటు చేసింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను సిట్ అధిపతిగా నియమించింది. ఈ బృందంలో సీఐడీ ఎస్పీ బి.ఉమా మహేశ్వర్‌తో పాటు మరో నలుగురు డీఎస్పీలు ఉంటారు. అక్రమ రవాణా చేస్తూ దొరికిన వాహనాలు సీజ్ చేస్తారు. వాహనం డ్రైవర్‌కి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తారు. వ్యాపారం చేసే వారికి పదేళ్ల జైలు శిక్ష, రూ. 1,00,000 జరిమానా విధిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Home Andhra Pradesh కాకినాడ పోర్టులో మళ్లీ బియ్యం కలకలం, కస్టమ్స్ కు పట్టుబడ్డ 142 కంటైనర్లు-kakinada port ration...