రాజధానిలో లే ఔట్‌లు, ట్రంక్ రోడ్లు, హైకోర్టు, అసెంబ్లీ భవనాలు,ఐకానిక్ టవర్ల నిర్మాణానికి అథారిటీ సీఆర్డీఏ అనుమతి ఇచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. ఇవాళ రూ.24,276.83 కోట్లకు సంబంధించిన పనులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. అమరావతి మొత్తం ఖర్చు రూ.62 వేల కోట్ల అంచనాలో ఇప్పటి వరకూ రూ.45,249.24 కోట్లకు అనుమతులు లభించినట్టు తెలిపారు. అసెంబ్లీ భవనం 11.22 లక్షల చదరపు అడుగులు, 250 మీటర్ల ఎత్తులో నిర్మాణం చేపట్టనున్నామన్నారు.
Home Andhra Pradesh అమరావతిలో రూ.24,657 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం, మూడు రోజుల్లో టెండర్ల ప్రక్రియ-jagtial youth cheated...