ఈ మిరపకాయల టీని పచ్చిమిర్చి లేదా ఎండు మిరపకాయలతో తయారుచేస్తారు. దాల్చినచెక్క, యాలకులు, అల్లం కూడా ఈ టీలో కలుపుతారు. ఇవన్నీ కలిపి చేస్తే సూపర్ టేస్టీ మిరపకాయ టీ తయారవుతుంది. వేడి నీటిలో మిరపకాయల తరుగు, దాల్చినచెక్క, అల్లం తరుగు వేసి బాగా మరిగించి దాన్ని వడకట్టి ఒక గ్లాసులో వేయాలి. దాన్ని వేడి వేడిగా తాగాలి. ఒక పచ్చిమిర్చిని వాడితే సరిపోతుంది.