పుష్ప2 రికార్డు స్థాయిలో 617 కోట్ల బిజినెస్‌ చేసి బ్రేక్‌ ఈవెన్‌కి 620 కోట్ల టార్గెట్‌ను పెట్టుకుంది. ఆ టార్గెట్‌ను 11వ రోజు సునాయాసంగా రీచ్‌ అయ్యాడు పుష్పరాజ్‌. సినిమా ప్రదర్శించబడుతున్న అన్ని సెంటర్స్‌లో ఊహకందని కలెక్షన్స్‌ సాధిస్తూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ముఖ్యంగా 11వ రోజు వచ్చాక కూడా తన స్టామినా ఏమిటో మరింత స్ట్రాంగ్‌గా చెప్పాడు పుష్పరాజ్‌. 12 కోట్లకుపైగా షేర్‌ని సొంతం చేసుకొని హిందీలో 48 కోట్ల షేర్‌ను కలెక్ట్‌ చేసింది. 11వ రోజు 105 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్‌ చేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల గ్రాస్‌ 1300 కోట్లు కాగా, అందులో 639 కోట్ల షేర్‌ లభించింది. దీంతో 620 కోట్ల టార్గెట్‌ను ఎప్పుడో రీచ్‌ అయిపోయింది. 

మొదటి రోజు కలెక్షన్స్‌ నుంచే పాత రికార్డులను చెరిపేస్తూ తన విజయ యాత్ర కొనసాగిస్తున్న పుష్ప2 బ్రేక్‌ ఈవెన్‌ సాధించడమే కాకుండా దాదాపు 19 కోట్ల లాభాల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ని చూస్తే ఇదే ఊపుతో 2000 కోట్ల టార్గెట్‌ని కూడా పుష్ప2 రీచ్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అన్ని రికార్డులను క్రాస్‌ చేసేసిన ఈ సినిమా లాంగ్‌ రన్‌లో మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here