తాజా అల్పపీడన ప్రభావంతో బుధ, గురు వారాల్లో పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు కోస్తాలోని పలు ప్రాంతాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో వరి, పత్తి, పొగాకుతో పాటు ఇతర పంటలను సాగు చేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరికోతలు రెండు మూడు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోత కోసి పొలాల్లో ఉన్న వరి పసలను కుప్పలుగా వేసుకోవాలని అధికారులు సూచించారు.
Home Andhra Pradesh బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం,కోస్తా జిల్లాలకు పొంచి ఉన్న వానలు-low pressure again in bay of...