నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో గుప్పెడు నువ్వులు ప్రతిరోజూ తినండి. మీకు ఎన్నో రకాల సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో నువ్వులు ముందుంటాయి. రక్తపోటును తగ్గించడంలో కూడా నువ్వులు మంచి ఔషధంలా పనిచేస్తాయి. మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు నువ్వులను ఆహారంలో భాగం చేసుకోండి. మీకు త్వరగా ఉపశమనం కలుగుతుంది. నువ్వుల్లో పీచు అధికంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నువ్వుల్లో ఐరన్, కాపర్, సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఎక్కువగానే ఉంటాయి. పిల్లలకు, బాలింతలకు, మహిళలకు శారీరక శ్రమ అధికంగా చేసే వారికి నువ్వులు తినాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇచ్చిన నువ్వుల కూర ఒక్కసారి చేసుకుని చూడండి… స్పైసీగా మీకు ఎంతో నచ్చేలా ఉంటుంది.