ఫ్రెండ్స్‌కు పార్టీ…
మా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారని, నాన్నకు చెబితో ఒప్పుకోరని, నువ్వే మ్యానేజ్ చేయాలని మీనాను బతిమిలాడుతాడు బాలు. అదా సంగతి అని మీనా ఇటుకరాయి తీస్తుంది. ఇది విసిరే పని పెట్టుకోకు అని బాలు కంగారు పడతాడు. మావయ్య గారికి తెలిస్తే నన్ను తిడతారు…నాకెందుకు వచ్చిన తంటా అని మీనా అంటుంది. నిన్ను పర్మిషన్ అడగటం లేదు…హెల్ప్ చేయమని అడుగుతున్నానని బాలు అంటాడు. నిన్ను మోసం చేసిన శృతికి సాయం చేశావు…నాకు చేయవా అని అంటాడు. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావంటూ మీనాపై ఫైర్ అవుతాడు. నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానా అంటూ మీనా కూడా రివర్స్ ఎటాక్ మొదలుపెట్టడంతో బాలు తగ్గుగాడు.