Huzurabad Schoolbus: వందలాది మంది పిల్లలు… నిత్యం రద్దీగా ఉండే మాంటిస్సోరీ ప్రైవేట్ పాఠశాల. ఆదివారం సెలవు కావడంతో పిల్లలు ఎవరు లేరు. కానీ అనూహ్యంగా స్కూల్ ఆవరణలో పార్కింగ్ చేసిన బస్సులో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పేలోగా బస్సు కాలిపోయింది. ఆ సమయంలో పిల్లలు లేకపోవడం తృటిలో పెను ప్రమాదం తప్పింది. చుట్టుపక్కల ఇళ్ళకు, మిగతా బస్సులకు మంటలు విస్తరించకుండా స్థానికులు ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి రావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.