మెగా డీఎస్సీ..
11 వేల 62 ఖాళీలతో డీఎస్సీ నిర్వహించామని, 10 వేల 600 మందికి నియామక పత్రాలు ఇచ్చామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉద్యోగ నియామక పరీక్షలన్నీ పారదర్శకంగా జరిగాయని, ప్రశ్నాపత్రం లీక్ కాలేదని, ఖాళీలను భర్తీ చేస్తున్నామని వివరించారు. ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఖాళీ పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తామని చెప్పారు. ఉర్దూ మాధ్యమంలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి డీ-రిజర్వేషన్ విధానాన్ని పరిశీలించాలని కొంతమంది సభ్యులు తనను కోరారని.. కానీ అది సాధ్యం కాలేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.