హైదరాబాద్‌లో..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పలు ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీలు, బీహెచ్‌ఈఎల్‌లో 7.4, రాజేంద్రనగర్‌లో 8.2 డిగ్రీలు, గచ్చిబౌలి 9.3, వెస్ట్ మారేడ్‌పల్లిలో 9.9, కుత్బుల్లాపూర్ 10.2, మచ్చబొల్లారంలో 10.2, శివరాంపల్లిలో 10.3, జీడిమెట్ల 11.4, బాలానగర్ 11.5, పటాన్‌చెరు 11.7, షాపూర్ నగర్ 11.7, లింగంపల్లి 11.8, బోయిన్‌పల్లి 11.9, బేగంపేట 12, ఆసిఫ్‌నగర్ 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.