2018 లో నాచురల్ స్టార్ నాని(nani)నిర్మాతగా కాజల్ అగర్వాల్,నిత్య మీనన్,రెజీనా వంటి హీరోయిన్లుప్రధాన తారాగణంలో వచ్చిన మూవీ ‘అ’.ఈ మూవీతో దర్శకుడుగా పరిచయమైన ప్రశాంత్ వర్మ ఆతర్వాత కల్కి,జాంబీ రెడ్డి తో మంచి గుర్తింపు ని పొందాడు.ఇక గత సంవత్సరం వచ్చిన ‘హనుమాన్’ తో పాన్ ఇండియా హిట్ ని అందుకోవడంతో పాటు రికార్డు కలెక్షన్స్ తో బిగ్గెస్ట్ డైరెక్టర్ గా మారాడు.
రీసెంట్ గా ప్రశాంత్ వర్మ(prasanth varma)మాట్లాడుతు పుష్ప 2 లో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్(allu arjun)పెర్ ఫార్మెన్స్ వైల్డ్ ఫైర్.ప్రతి సీన్, ప్రతి డైలాగ్, అన్ని రకాల ఎమోషన్స్ ని
అద్భుతంగా ప్రదర్శించారు. ఆయన్ని ఐకాన్ స్టార్ అనడానికి ఇదే ఉదాహరణ.శ్రీ వల్లీ క్యారక్టర్ లో రష్మిక కూడా తన పాత్రకి ప్రాణం పోసింది.దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా చాలా బాగుంది.చిత్ర
విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి నా అభినందనలు.పుష్పని భారీ ఎత్తున నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ కి కూడా ప్రశాంత్ వర్మ తన కృతజ్ఞతలు తెలిపాడు.
ప్రశాంత్ వర్మ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ(balakrishna)నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ(mokshagna)ఫస్ట్ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు.కొన్ని రోజుల క్రితమే
ప్రారంభం కావాల్సిన ఈ మూవీ మోక్షజ్ఞ కి చిన్న ఇంజురీ కావడంతో వాయిదా పడింది. త్వరలోనే మంచి ముహూర్తం చూసీ ప్రారంభించనున్నారు.