2001 లో ఇన్ స్క్రుటబుల్ అనే ఇంగ్లీష్ మూవీ ద్వారా దర్శకుడుగా తన సత్తా చాటిన చంద్ర సిద్దార్ధ్(chandra siddartha)ఆ తర్వాత ‘అప్పుడప్ప్పుడు’అనే చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసాడు.’ఆ నలుగురు’ మధుమాసం,ఇది సంగతి,అందరి బంధువయ్యా,ఏమో గుర్రం ఎగరావచ్చు,ఆట కదరా శివ’ అనే పలు విభిన్నమైన చిత్రాలని ప్రేక్షకులకి అందించి దర్శకుడిగా మంచి గుర్తింపుని పొందాడు.

లేటెస్ట్ గా ఆయనొక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్ ని తెరకెక్కించబోతున్నానని,వాటిల్లో ‘టబు'(tabu)తో లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా ఉంటుందని తెలిపారు ఆ మూవీని అన్ని భాషల్లోను రిలీజ్ చేస్తామని కూడా అయన చెప్పడం జరిగింది.చంద్ర సిద్దార్ద్, టబు కాంబోలో గతంలో ‘ఇది సంగతి’ మూవీ వచ్చింది.ఇక ‘ఆ నలుగురు మూవీ’ కమర్షియల్ గాను సక్సెస్ అవ్వడమే కాకుండా అనేక అవార్డుల్ని కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here