ఈమధ్యకాలంలో రీరిలీజ్‌లు థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్‌హిట్‌ అయిన చాలా తెలుగు సినిమాలు ఇటీవల రీరిలీజ్‌ అయి కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు హాలీవుడ్‌ సినిమాలు సైతం రీరిలీజ్‌వైపు దృష్టి సారిస్తున్నాయి. ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలన్‌ 2014లో రూపొందించిన ‘ఇంటర్‌స్టెల్లార్‌’ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసిన ఈ సినిమాను టీవీ ఛానల్స్‌లో, ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లపై గత పది సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో హయ్యస్ట్‌ వ్యూస్‌ ఉన్న సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఈ చిత్రాన్ని థియేటర్లలో రీరిలీజ్‌ చెయ్యాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. పది సంవత్సరాల తర్వాత డిసెంబర్‌ 6న ఈ సినిమా విడుదలైంది. పది సంవత్సరాల క్రితం ఈ సినిమాకి ఎలాంటి క్రేజ్‌ ఉందో అదే క్రేజ్‌తో థియేటర్లలో రిలీజ్‌ అయి కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాను ఇండియాలో రీరిలీజ్‌ చెయ్యలేదు. 

డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలన్‌కి ఇండియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలకు ఆదరణ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయినా ఇప్పటివరకు ఈ సినిమాను రీరిలీజ్‌ చెయ్యలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో రీరిలీజ్‌ చెయ్యాలంటే పలు వెర్షన్స్‌లో చెయ్యాల్సి ఉంటుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల రీరిలీజ్‌ లేట్‌ అవుతోంది. ఎట్టకేలకు అన్ని అవరోధాలు తొలిగిపోయి 2025 జనవరిలో మరోసారి ‘ఇంటర్‌స్టెల్లార్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉండే ఈ సినిమాను ఐమ్యాక్స్‌ వెర్షన్‌లో చూసేందుకే విదేశీయులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇండియా ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో ఉన్న థియేటర్లు తక్కువ కాబట్టి 70 ఎంఎం స్క్రీన్స్‌లోనే ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. మరి వచ్చే ఏడాది రీరిలీజ్‌ అయ్యే ‘ఇంటర్‌ స్టెల్లార్‌’కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here