ఏం జరిగిందంటే…
డిసెంబర్ 15న నూజివీడులో జరిగిన బీసీల నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ, బహిరంగ సభా కార్యక్రమంలో మంత్రి సారథితో పాటు గౌతు లచ్చన్న కుమార్తె, ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ ఎంపీ నారాయణ పాల్గొన్నారు. ఇదే సభలో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ కూడా పాల్గొన్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్‌ను కార్యక్రమ నిర్వాహకులు సభకు ఆహ్వానించడంతో ఒకే వేదికపై టీడీపీ, వైసీపీ నాయకులు ఆ వేదికను పంచుకున్నారు. ఈ క్రమంలో వేదికపై నుంచి వైఎస్సార్‌ను పొగుడుతూ జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారు.