ప్రముఖ హీరో అల్లు అర్జున్(allu arjun)హైదరాబాద్ సంధ్యా థియేటర్ లో సంభవించిన మహిళ మృతి కేసులో  ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న విషయం తెలిసిందే.ఇక జైలు నుంచి అల్లు అర్జున్ బయటకి రాగానే చిత్ర పరిశ్రమకి చెందిన సినీ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ ని కలిసిన విషయం తెలిసిందే.ఆ తర్వాత అల్లు అర్జున్ స్వయంగా చిరంజీవి,నాగబాబు నివాసానికి వెళ్లి కేసు విషయంతో పాటు మహిళ మృతి,బాబు ఆరోగ్యం గురించి చర్చించడం జరిగింది.

ఇక ఆ టైంలోనే  పవన్ కళ్యాణ్(pawan kalyan)ని కూడా అల్లు అర్జున్ కలవబోతున్నాడని వార్తలు వచ్చాయి.నిజానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు రాత్రే  పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చాడు. కానీ ఆ మరుసటి రోజే  ప్రభుత్వ కార్యక్రమం ఉండటంతో పవన్ ఏపి కి వెళ్ళిపోయాడు.దీంతో అల్లు అర్జునే ఏపి కి వెళ్తాడని ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు పవన్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరాడని తెలుస్తుంది. హైదరాబాద్ రాగానే నేరుగా తన ఇంటికి పవన్ వెళ్తాడని, అల్లు అర్జున్ కూడా పవన్ దగ్గరకి వెళ్ళబోతున్నాడని అంటున్నారు.దీంతో పవన్, అల్లు అర్జున్ భేటీ పై ఇరువురి అభిమానుల్లోను ఉత్కంఠత నెలకొని ఉంది.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీ తేజ్ హాస్పిటల్ లో ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here