మంచు మోహన్ బాబు(mohan babu)విష్ణు(vishnu)లపై గత కొన్ని రోజుల క్రితం మనోజ్(manoj)చేసిన పోరాటం ఎంతగా సంచలనం సృష్టించిందో అందరకి తెలిసిన విషయమే.ఇకపై ఎలాంటి గొడవలు జరగవని ఆ ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులకి హామీ కూడా ఇచ్చారు.కానీ రెండు రోజుల క్రితం విష్ణు అన్న మాఇంట్లో కరెంట్ పోయేలా చేసాడని మనోజ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.ఈ నేపథ్యంలో మనోజ్ అమ్మ నిర్మల(nirmala)హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీసులకి ఒక లేఖ రాయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆమె తన లేఖలో ‘నా పెద్ద కుమారుడు విష్ణు డిసెంబర్ 14 న నా పుట్టిన రోజు సందర్భంగా జల్లేపల్లి లోని మా ఇంటికి కేక్ తీసుకొని వచ్చిసెలబ్రేట్ చేసాడు.దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ వేరే గా అర్ధం చేసుకొని,సిసి టీవీ ఫుటేజ్ ని బయటపెట్టి విష్ణు గొడవ చేసినట్టు లేని పోనీ ఆరోపణలు చేస్తు పోలీస్ కేసు కంప్లంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.విష్ణు ఎలాంటి గొడవ చెయ్యలేదు.ఆ రోజు నా బర్త్ డే సెలబ్రేట్ చేసిన విష్ణు రూమ్ లో ఉన్న తన సామాను తీసుకొని వెళ్ళిపోయాడు.పైగా మా ఇంట్లో ఉన్న పని వాళ్ళు కూడా మేము ఇక్కడ చేయలేమని వెళ్లిపోయారు.అంతే కానీ మనోజ్ చెప్తున్నట్టుగా విష్ణు వల్ల ఎవరు పని మానేయలేదు.ఇంట్లో మనోజ్ కి ఎంత హక్కు ఉందో,నా పెద్ద కొడుకు విష్ణు కి కూడా అంతే హక్కు ఉందని తన లేఖలో పేర్కొంది.