2024 కి సంబంధించి బారతీయ చిత్ర సీమలో ఎన్నో  సినిమాలు పాన్ ఇండియా అనే టాగ్ లైన్ తో  తెరకెక్కడం జరిగింది.అందులో కేవలం కొన్ని మాత్రమే ప్రేక్షకులని అలరించడమే కాకుండా రికార్డు కలెక్షన్స్ ని కూడా సృష్టించాయి.చాలా సినిమాలు పాన్ ఇండియా కాదు కదా కనీసం సొంత భాషలోనూ విజయాన్ని సాధించలేకపోయాయి.మరి ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం.

ముందుగా తెలుగులో చూసుకుంటే ఈగల్,ఆపరేషన్ వాలైంటైన్,మట్కా,డబుల్ ఇస్మార్ట్,(double ismart)తమిళంలో ఇండియన్ 2 (indiyan 2),వెట్టయ్యన్,ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం,కంగువా,లాంటి మూవీస్,హిందీలో బడే మియా చోటే మియా,మైదాన్,జిగ్రా,యోధ,క్రాక్,సింగం అగైన్, మోహన్ లాల్ నటించిన మలై కోటే వాలి భన్’ అనే మలయాళ చిత్రం, ఇలా ఈ సినిమాలన్నీ కూడా   చిత్రాలు  పాన్ ఇండియా లెవల్లో విడుదలయ్యాయి.రిలీజ్ కి ముందు మేకర్స్ అంతే స్థాయిలో పబ్లిసిటీ కూడా చేసారు.కానీ సొంత బాషా ప్రేమికులని కూడా మెప్పించలేకపోయాయి.

దీనికంతటికి ఒకే కారణం సరైన కథ లేకపోవడమే.పాన్ ఇండియా పేరుతో పర బాషా నటుల్ని తీసుకొని సినిమా నిర్మిస్తున్నారు తప్ప కథ ఆ స్థాయిలో ఉందా లేదా అని చూడలేకపోతున్నారని, అందుకే పరాజయాలు చెందుతున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here