తెలుగు చిత్ర సీమలో నందమూరి బాలకృష్ణ(balakrishna)కి ఉన్నచరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.తన ఐదు దశాబ్దాల సినీ జీవితంలో ఆయన పోషించని పాత్ర లేదు.సృష్టించని రికార్డు లేదు.తెలుగు సినిమా ఏనాడో మర్చిపోయిన అర్ధ శతదినోత్సవం,శతదినోత్సవం,సిల్వర్ జూబ్లీలని నేటికి సాధిస్తూ అభిమానుల చేత,ప్రేక్షకుల చేత జై బాలయ్య అనిపించుకుంటున్నాడు.ఇప్పుడు ఇదే ఆనవాయితీని కంటిన్యూ చేస్తూ, సంక్రాంతి కానుకగా జనవరి 12 న ‘డాకు మహారాజ్'(daku maharaj)గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

లేటెస్ట్ గా ‘డాకు మహారాజ్’ యూఎస్ లో బుకింగ్స్ ని ఓపెన్ చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇరవై తొమ్మిది ఏరియాల్లో,డెబ్భై ఏడుషోలకి సంబంధించి బుకింగ్స్ మొదలవ్వగా, టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా సేల్స్ అయ్యాయని తెలుస్తుంది.కొన్నిరోజుల్లో మరిన్ని చోట్ల కూడా బుకింగ్స్ ఓపెన్ ఓపెన్ చేయబోతున్నారని,దీంతో బాలకృష్ణ యుఎస్ లో సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

బాలకృష్ణ నుంచి వస్తున్న ఈ నూట తొమ్మిదవ చిత్రానికి ‘బాబీ'(bobby)దర్శకుడనే విషయం తెలిసిందే.ఈ ఇద్దరి కాంబోలో సినిమా అనగానే అందరు రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనుకున్నారు.కానీ ఎప్పడైతే టైటిల్, టీజర్ రిలీజ్ అయ్యిందో అప్పుడు అందరకి అర్ధమయ్యింది.బాలయ్య మరోసారి ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ లో తన విశ్వరూపం చూపించబోతున్నాడని.దీంతో ‘డాకు మహారాజ్’ కోసం నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.ఇక ట్రైలర్ రిలీజ్ తో పాటు ప్రీ రిలీజ్ కూడా త్వరలోనే అభిమానుల సమక్షంలో ఘనంగా జరగనుంది. అగ్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్ టైన్మెంట్,ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న’డాకు మహారాజ్’ బాలకృష సరసన ప్రగ్యా జైస్వాల్ జత కడుతుంది.ఈ జంట అఖండ తో హిట్ పెయిర్ అనిపించుకున్న విషయం తెలిసిందే.థమన్(taman)వరుసగా మరోసారి మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఇటీవల రిలీజైన గండ్ర గొడ్డలి పాట రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here