Realme 14x launch: రియల్మీ తన మరో సరసమైన స్మార్ట్ ఫోన్ రియల్మీ 14ఎక్స్ ను డిసెంబర్ 18, 2024 న భారతదేశంలో లాంచ్ చేయనుంది. గత కొన్ని వారాలుగా, ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ప్రదర్శిస్తూ కంపెనీ టీజ్ చేస్తోంది. ఇప్పుడు, లాంచ్ కు ముందు, రాబోయే రియల్మీ 14ఎక్స్ ధరను కూడాద వెల్లడించింది. రూ .15000 కంటే తక్కువ ధరకు ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుందని రియల్మీ వెల్లడించింది. అందువల్ల, వినియోగదారులకు బడ్జెట్ ధరలో, అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ ను అందిస్తున్నట్లు తెలిపింది.