ఇంకా 12 వేల టన్నుల బియ్యం
కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకలో 1,320 టన్నుల రేషన్ బియ్యాన్ని అన్‌లోడ్ చేయించి సీజ్ చేస్తామని కలెక్టర్ షాన్ మోహన్ ప్రకటించారు. పోర్టులో ఇంకా 12 వేల టన్నుల బియ్యం లోడ్ చేయాల్సిన ఉందన్నారు. వీటిలో పీడీఎస్ బియ్యం లేవని నిర్థారించాకే లోడింగ్‌కు అనుమతిస్తామన్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు, డీప్ సీ వాటర్ పోర్టులో కూడా మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేశామన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా నిఘా పెట్టామన్నారు. ఒక్క గ్రాము పీడీఎస్ బియ్యం కూడా దేశం దాటకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు. స్టెల్లా షిప్‌ను ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. నిజాయితీగా రైస్ బిజినెస్ చేసే వారికి ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందన్నారు. వ్యాపారులు, కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు.