నితిన్(nithiin)శ్రీలీల(sreeleela)హీరో హీరోయిన్లుగా మైత్రి మూవీస్ పై యలమంచిలి రవిశంకర్(ravi shankar)ఎర్నేని నవీన్(naveen)నిర్మిస్తున్నచిత్రం రాబిన్ హుడ్(robhin hood)నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జట్ తో రూపుదిద్దికుంటున్న ఈ మూవీకి వెంకీ కుడుముల(venky kudumula)దర్శకుడు.ఇంతకు ముందు నితిన్, వెంకీ కాంబోలో వచ్చిన ‘భీష్మ’ సూపర్ డూపర్ హిట్ ని సాధించడంతో రాబిన్ హుడ్ పై నితిన్ అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోను   భారీ అంచనాలు ఉన్నాయి.

రాబిన్ హుడ్ ని తొలుత డిసెంబర్ 25 న రిలీజ్ చెయ్యాలని మేకర్స్ భావించారు.ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది.కానీ ఇప్పుడు డిసెంబర్ 25 న విడుదల చెయ్యడం లేదని మైత్రి సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.అనుకోని పరిస్థితుల వల్లే రిలీజ్ ని వాయిదా వేస్తున్నామని త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని కూడా సదరు సంస్థ పేర్కొంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తవకపోవడం వలనే వాయిదాకి కారణమనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది.

ఇక ఇటీవల’రాబిన్ హుడ్’ టీం ఒక ప్రెస్ మీట్ ని నిర్వహించింది.అందులో మేకర్స్ మాట్లాడుతు ఒక పాట మినహా సినిమా మొత్తం పూర్తయ్యిందని తెలపడంతో పాటుగా నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని తెలిపారు.అందుకు తగ్గట్టే ఇటీవల రిలీజైన టీజర్, సాంగ్స్ మంచి అదరణని సొంతం చేసుకున్నాయి.వరుస ప్లాప్ లతో ఉన్న నితిన్ కి ఈ సినిమా హిట్ చాలా అవసరం.రాబిన్ హుడ్ ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఇటీవల పుష్ప 2(pushpa 2)తో పాన్ ఇండియా హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here