రేషన్ బియ్యం అక్రమ రవాణాతో తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారు. తాను బియ్యం వ్యాపారం చేయడంలేదని, తన తమ్ముడు బియ్యం ఎగుమతి వ్యాపారంలో ఉన్నారన్నారు. అయితే రేషన్ బియ్యం వ్యవహారంలో ఎమ్మెల్యే కొండబాబు హస్తం ఉందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే కాకినాడలోని గోదాముల్లో తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం అయ్యిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలు విచారణ జరుపుతున్నాయి.
Home Andhra Pradesh రేషన్ బియ్యం స్మగ్లింగ్ లో కదులుతున్న డొంక, తెరపైకి కీలక నేతల పేర్లు!-ap ration rice...