తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 18 Dec 202402:25 AM IST
తెలంగాణ News Live: TG Indiramma Housing Scheme : ‘ఇందిరమ్మ’ ఇంటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? వీటిని తెలుసుకోండి
- TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం యాప్ సర్వే చేస్తోంది. అయితే దరఖాస్తు చేసుకుని వారు ఉంటే కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అర్హతలు, దరఖాస్తు విధానం వివరాలు ఇక్కడ చూడండి…
Wed, 18 Dec 202401:09 AM IST
తెలంగాణ News Live: Formula E Race Scam Case : ఫార్ములా ఈరేసు వ్యవహారం – విచారణ కోసం ఏసీబీకి సీఎస్ లేఖ, 10 ముఖ్యమైన అంశాలు
- Formula E Car Race Case Scam : ఫార్ములా ఈ-రేస్ విచారణ కొరకు తెలంగాణ సీఎస్… ఏసీబీకి లేఖ రాశారు. నిధుల దుర్వినియోగం పై విచారణ జరపాలని కోరారు. ఈ మేరకు గవర్నర్ అనుమతి ఇచ్చిన లేఖను జత చేశారు. దీంతో ఈ కేసులో విచారణ షురూ కానుంది. ఈ కేసులో కేటీఆర్ ను విచారించే అవకాశం ఉంది.
Wed, 18 Dec 202412:46 AM IST
తెలంగాణ News Live: Sircilla Weavers : సిరిసిల్ల నేతన్నలకు ‘పొంగల్’ ఉపాధి – భారీగా చీరల ఆర్డర్ ఇచ్చిన తమిళనాడు సర్కార్…!
- వస్త్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి దొరికింది. సాంచల్ బంద్ అయి ఉపాధి కరువై ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న నేతన్నకు తమిళనాడు బాసటగా నిలిచింది. పొంగల్ చీరల ఆర్డర్ ఇచ్చి నేతన్నకు చేతినిండా పని కల్పించింది. వస్త్ర పరిశ్రమ నిలయమైన సిరిసిల్ల సాంచల చప్పుడుతో సందడిగా మారింది.