పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)నటించిన  ఎపిక్ సైన్స్ అండ్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి(kalki 2898 ad)జూన్ 27 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆరువందల కోట్ల భారీ బడ్జట్ తో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్కుని కూడా అందుకుంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే వంటి నేషనల్ స్టార్స్ కూడా నటించారు.

ఇక ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జనవరి 3 న జపాన్ లో జపాన్ లాంగ్వేజ్ లోనే విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా ప్రభాస్ ఒక వీడియో విడుదల చెయ్యడం జరిగింది.అందులో ఆయన జపాన్ ప్రేక్షకులని ఉద్దేశించి  మాట్లాడుతు కల్కి జపాన్ లో విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది.మూవీ మీ అందరకి బాగా నచ్చుతుంది.నేను ప్రమోషన్స్ కి వద్దామని అనుకున్నాను. కానీ చిన్న ఇంజురీ కావడం వలన రాలేకపోతున్నాను. ఈ సారి ఖచ్చితంగా వస్తానని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సదరు వీడియోలో ప్రభాస్ కొంచంసేపు  జపాన్ భాషలో కూడా మాట్లాడటం జరిగింది.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here