Paritala Ravi Murder Case : టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసు నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఐదుగురి నిందితులకు హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ3 నారాయణరెడ్డి, ఏ4 రేఖమయ్య, ఏ5 రంగనాయకులు, ఏ6 వడ్డే కొండ, ఏ8 ఓబిరెడ్డికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 2005 జనవరి 24న అనంతపురం జిల్లా పెనుకొండలో పరిటాల రవి హత్యకు గురైన విషయం తెలిసిందే. పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న పరిటాల రవిపై ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారు. పరిటాల రవి మరణాంతరం ఆయన సతీమణి సునీత రాజకీయాల్లో వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఎన్నికల్లో రాప్తాడు ఎమ్మెల్యేగా గెలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here