సింహ రాశి:
ఈ రాశి వారికి 2025 సంవత్సరంలో బృహస్పతి 11వ ఇంట్లో సంచరిస్తారు. వృత్తిపరంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. కొత్త అవకాశాలు మీకు అందుతాయి. పై అధికారుల నుండి ప్రశంసలు, పదోన్నతులు పొందే అవకాశం ఉంది. అవివాహిత వ్యక్తులు త్వరలోనే వివాహం చేసుకుంటారు. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. వారసత్వ ఆస్తి వల్ల కలిగే సమస్యలన్నీ తగ్గుతాయి. ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న డబ్బు మీ చేతికి వస్తుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు.