మహాకుంభమేళా ఈ సారి ఎలా చూసుకున్నా ప్రత్యేకం. 144 ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన సంఘటన చోటు చేసుకుందని పండితులు చెబుతున్నారు. మహా కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని, 12-12 దశలు పూర్తయిన తర్వాత జరిగే కుంభమేళాను పూర్తి మహాకుంభం అని పిలుస్తారని తెలిపారు. యోగ లగ్నం, గృహం, తిథి అన్నీ అనుకూలంగా ఉంటే అది అరుదైన సంఘటన అవుతుంది. ప్రతి 12 సంవత్సరాల తరువాత, ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా, ఆరవ సంవత్సరంలో అర్ధ కుంభమేళా, 144 సంవత్సరాల విరామంలో పూర్ణ మహా కుంభమేళా నిర్వహిస్తారు.