సహాయ చర్యలు..
11 నేవీ బోట్లు, మూడు మెరైన్ పోలీస్ బోట్లు, ఒక కోస్ట్ గార్డ్ పడవతో భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగించాయి. పోలీసులు, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీకి చెందిన సిబ్బంది, ఆ ప్రాంతంలోని స్థానిక మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. నాలుగు హెలికాఫ్టర్లను కూడా రంగంలోకి దింపారు. ‘‘’ముంబై హార్బర్ లో ప్యాసింజర్ ఫెర్రీ, ఇండియన్ నేవీ క్రాఫ్ట్ ఢీకొన్న ఘటనలో విలువైన ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. రెండు నౌకల్లోని నావికాదళ సిబ్బంది, పౌరులతో సహా గాయపడిన సిబ్బంది అత్యవసర వైద్య చికిత్స పొందుతున్నారు’’ అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.