అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ గత రెండు వారాల నుంచి బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.1500 కోట్ల వసూళ్లకి చేరువగా ఉన్న పుష్ప 2 మూవీలో.. నిడివి కారణంగా కొన్ని సీన్స్‌ను డిలీట్ చేశారు. వాటిని ఇప్పుడు యాడ్ చేసి తాజాగా టైటిల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియో సాంగ్‌ను చూసిన అభిమానులు.. ఇంత మంచి సీన్స్‌ను ఎందుకు డిలీట్ చేశారు? అని దర్శకుడు సుకుమార్‌పై మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here