బంగారు గొలుసులతో పారిపోతుండగా తేరుకున్న సేల్స్‌మాన్ అతని వెనుక కేకలు వేస్తూ పరుగులు తీశాడు. నిందితుడిని వెంబడించిన ట్రాఫిక్ పోలీసులు కొద్ది దూరంలోనే నిందితుడి పట్టుకున్నారు. అతని జేబులో ఉన్న ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 39గ్రాముల విలువైన గొలుసుల్ని అపహరించినట్టు గుర్తించారు. చోరీకి గురైన బంగారాన్ని జ్యూయలరీ షాపు యాజమాన్యానికి అప్పగించారు. నిందితుడు డమ్మీ పిస్టల్‌తో బెదిరించినట్టు గుర్తించారు. కాకినాడ వన్‌టౌన్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Home Andhra Pradesh బొమ్మ తుపాకీతో బెదిరించి కాకినాడలో బంగారం దోపిడీ.. చివరకు ఏమైందంటే…-gold robbery in kakinada by...