ఎన్టీఆర్,(ntr)రామ్ చరణ్(ram charan)హీరోలుగా రాజమౌళి(rajamouli)దర్శకత్వంలో 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR)ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే.పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ మూవీ అన్ని ఏరియాల్లోను కూడా రికార్డు కలెక్షన్స్ ని వసూలు చేసింది.తెలుగు వారు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఆస్కార్ ని సైతం అందుకొని ప్రపంచ సినిమా పితామహుడు గా గుర్తింపు ని పొందిన జేమ్స్ కామెరూన్ ప్రశంసల్నిసైతం అందుకుంది.

ఇక ఈ మూవీకి సంబంధించిన విశేషాలన్నింటిని రాజమౌళి ఒక డాక్యుమెంటరీ రూపంలో తెరెకెక్కించిన విషయం తెలిసిందే.డిసెంబర్ 20 న ఎంపిక చేసిన మల్టిప్లెక్స్ థియేటర్స్ లో  విడుదల కానుంది.టికెట్ ధరని 200 నుంచి 300 రూపాయిల దాకా నిర్ణయించారు. గంట ముప్పై ఎనిమిది నిమిషాల నిడివితో తెరెక్కిన ఈ డాక్యుమెంటరీలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఆస్కార్ అందుకునే వరకు చోటు చేసుకున్న సంఘటనల్ని చూపిస్తున్నారు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here