ప్రభుత్వం కాంట్రాక్టర్లకు గుడ్లు సరఫరా చేసినందుకు.. ఆ నెలలోని మార్కెట్ ధరకు అదనంగా 51 పైసలు రవాణా ఛార్జీలు కలిపి చెల్లిస్తుంది. ఇటీవల కోడిగుడ్ల ధర రూ.7 వరకు అయ్యింది. దీంతో గిట్టుబాటు కాక చిన్నసైజు గుడ్లను స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం.. ఒక గుడ్డు 45 గ్రాముల బరువు ఉండాలి. కానీ.. సరఫరా చేస్తున్న గుడ్డు అంత ఉండటం లేదు. రాష్ట్రంలోని 55 వేల 607 అంగన్వాడీ కేంద్రాలకు ప్రతీరోజూ లక్షలాది గుడ్లను సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం అన్నీ చిన్న సైజు గుడ్లనే సరఫరా చేసేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Home Andhra Pradesh గుడ్డు పోయింది.. అంగట్లోకి అంగన్వాడీ గుడ్లు.. తెరపైకి కొత్త దందా!-eggs from anganwadi centers are...