భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించడానికి ఓలా ఎలక్ట్రిక్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ మధ్య పోటీ ఉంది. ఈ డిసెంబర్ నెలలో మూడు కంపెనీలు గరిష్టంగా ఈ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. బజాజ్ చేతక్ అన్ని కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లను అధిగమించి మొదటి స్థానానికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వాహన్ వెబ్‌సైట్ ప్రకారం.. డిసెంబర్ 1 నుండి 14 మధ్య కాలంలో బజాజ్ చేతక్ దాదాపు 9,513 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here