(2 / 5)
వరంగల్ వెళ్తే కచ్చితంగా కోటను చూడాలి. కాకతీయ రాజులు నిర్మించిన కోట ఇది. పర్యాటకుల్ని ఎంతో ఆకర్షిస్తున్న ఈ ప్రాంతాన్ని అడ్వెంచర్ పర్యాటకంగా మార్చనున్నారు. గుండు చెరువులో బోటింగ్, రాతి కీర్తి తోరణాలు, రాతికోట, ఖుష్‌మహల్ ఆకర్షించేలా ఫసాడ్ విద్యుత్తు వెలుగుల సదుపాయం కల్పించారు. చెరువు చుట్టూ బండ్ నిర్మాణం చేపడుతున్నారు. ఇక్కడికి వస్తే.. నగరంలోని ఉన్న ప్రైవేట్ హోటల్స్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఇది వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి కేవలం 2.4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.