మూవీ: లీలా వినోదం

నటీనటులు: షణ్ముఖ్ జస్వంత్, అనఘ అజిత్, ఆమని, గోపరాజు రమణ, వి.ఎస్ రూప లక్ష్మీ , మిర్చీ శరణ్ తదితరులు

ఎడిటింగ్: నరేశ్ ఎడుప

సినిమాటోగ్రఫీ: అనూష్ కుమార్

మ్యూజిక్: టి.ఆర్ కృష్ణ చేతన్

నిర్మాతలు: శ్రీధర్ మరిశ

దర్శకత్వం:  పవన్ సుంకర

ఓటీటీ: ఈటీవి విన్

కథ:

ప్రసాద్(షణ్ముఖ్ జస్వంత్) ఓ కాలేజ్ స్టూడెంట్. అతని క్లాస్ మేట్ లీలా(అనఘా అజిత్). తనంటే ప్రసాద్ కి చాలా ఇష్టం కానీ తన ఇష్టాన్ని ఆమెకి చెప్పలేడు. అదే సమయంలో ప్రసాద్ తన ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతుంటారు. అలా మూడు సంవత్సరాలు దాటి తమ కాలేజీ ముగిసే సమయంలో ఇద్దరు తమ నంబర్స్ ఒకరి దగ్గర ఒకరు తీసుకుంటారు. అక్కడ నుంచి సరదాగా చాట్ చేసుకుంటారు కూడా.. కానీ ఓ రోజు ఫైనల్ గా తన ఫ్రెండ్ రాజేష్(మిర్చి శరన్) సాయంతో ప్రసాద్ తన ప్రేమని లీలాకి చెప్పేస్తాడు. కానీ ఆ తర్వాత ఆమె నుంచి ప్రసాద్ కి ఒక్క రిప్లై కూడా వెనక్కి రాదు.  ప్రసాద్ ఫ్రెండ్స్ అంతా కలిసి తనకి ఇష్టం లేదేమో ఉంటే రిప్లై ఇచ్చేది కదా అంటారు.  అసలు లీలా ఎందుకు రిప్లై ఇవ్వలేదు. ప్రసాద్ ఏం చేశాడు? వాళ్ళిద్దరూ కలిసారా లేదా? వారి ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ: 

ఈ కథ 2008 లో కాలేజీలో చదివే స్టూడెంట్స్ లైఫ్ ని చూపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఆ టైమ్ లో ఆకర్షణ, ప్రేమ తెలిసీ తెలియని టైమ్ అని అనుకుంటూ కొన్ని కల్పిత సన్నివేశాలతో ముందుకు సాగే కథనం ఆకట్టుకుంటుంది. సినిమా నిడివి గంటన్నరే అయిన స్లోగా సాగుతున్న ఫీల్ కన్పిస్తుంది. 

కామెడీ కాస్త పర్వాలేదు. అయితే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మిస్ అయింది. అడల్ట్ సీన్స్ లేవు. లీలా, ప్రసాద్ ల మధ్య సంభాషణలు చాలా లిమిటెడ్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో కూడా కొన్ని డైలాగ్స్ ఇంకా ఆడ్ చేయొచ్చు. ఇద్దరి మధ్య ప్రేమని ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు చివరి ఇరవై నిమిషాలు మాత్రమే తీసుకున్నాడు. 

సూర్య, సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ లలో షణ్ముఖ్ ని చూసిన అతని అభిమానులు ఇది చూసాక నిరాశ చెందక తప్పదు. ఎందుకంటే డైలాగ్స్ ఎక్కువగా లేవు. కథ కూడా స్లోగా సాగుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఎక్కడ అడల్ట్ సీన్లు లేకుండా మేకర్స్‌ జాగ్రత్త పడ్డారు. హీరో లుక్ కాస్త భిన్నంగా ఉంటుంది. అంటే మేకప్ సరిగ్గా కుదరక అలా ఉందేమో అనిపిస్తుంది. పాతకాలంలో వాడే నోకియా ఫోన్ లు , కాలేజీలో గ్రీటింగ్ కార్డ్స్ పంచుకోవడం , స్లామ్ బుక్ లో ఇష్టమైనవి రాయడం.. ఇలా కొన్ని 90’s జనరేషన్ లోని యూత్ కి కనెక్ట్ అవ్వొచ్చు. ఇది ప్రెజెంట్ యూత్ కి చాలా బోరింగ్ సినిమా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సినిమా నిడివి గంటన్నరే కాబట్టి ఓసారి ట్రై చేయొచ్చు. ఎడిటింగ్ బాగుంది. మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు:

ప్రసాద్ గా షణ్ముఖ్ జస్వంత్, లీలాగా అనఘా అజిత్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.  మిర్చి శరణ్, గోపరాజు రమణ, ఆమని రూపలక్ష్మీ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. 

ఫైనల్ గా : వన్ టైమ్ వాచెబుల్

రేటింగ్:  2 / 5

✍️. దాసరి  మల్లేశ్


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here