రైళ్ల వివరాలు..
చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన తర్వాత 50 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. ప్రతిరోజూ దాదాపు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చర్లపల్లి 26 రైళ్లు ఆగుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా కృష్ణా ఎక్స్‌ప్రెస్, గుంటూరు ఇంటర్‌సిటీ, కాగజ్‌నగర్ ఇంటర్‌సిటీ, మిర్యాలగూడ ఎక్స్‌ప్రెస్, పుష్-పుల్, శబరి ఎక్స్‌ప్రెస్, శాతవాహన, కాకతీయ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి, రేపల్లె ప్యాసింజర్, ఘట్‌కేసర్ ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నాయి.