AP Telangana Weather Updates : తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది. ఆ తర్వాత పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఇక డిసెంబర్ 24 నుంచి మళ్లీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.