శ్రీహరిని పుష్ప ప్రియుడని పిలుస్తారు. తిరుమలని పురాణాల ప్రకారం పూలమంటపం అని పిలుస్తారు. శ్రీహరి పుష్పాలంకరణ ప్రియుడు కావడం వలన ఎప్పుడూ కూడా వివిధ రకాల పువ్వులతో ఆయనను అలంకరిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు, పూలను తాకకూడదని నిబంధన ఉంది. అంతే కాక స్వామి వారు అలంకరణ ప్రియుడు కాబట్టి అక్కడ పూలన్నీ కూడా ఆయనకే చెందాలని, కొండపై పూసిన ప్రతి పువ్వు శ్రీనివాసుడికి చెందుతుందని భక్తులు భావిస్తారు. అందుకని కొండపైన ఎవరూ కూడా పూలు పెట్టుకోరు.