సిరీస్లో ఇంకా రెండు టెస్టులు
భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 26 నుంచి మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఆ తర్వాత జనవరి 3 నుంచి సిడ్నీలో ఐదో టెస్టు జరగనుంది. అయితే.. కీలకమైన ఈ రెండు టెస్టుల మంగిట అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
అశ్విన్ అనూహ్య రిటైర్మెంట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిరీస్ ముగిసే వరకు ఎందుకు ఎదురు చూడలేదని కొందరు మాజీ ఆటగాళ్లు అతడ్ని ప్రశ్నిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత అశ్విన్ వెంటనే జట్టును వీడి భారత్కు తిరిగొచ్చాడు. ఈ విషయంపై పాక్ మాజీ బ్యాట్స్ మన్ బాసిత్ అలీ మాట్లాడుతూ.. ఒకవేళ విరాట్ కోహ్లీ భారత్కు ఇప్పుడు కెప్టెన్గా ఉండి ఉంటే అశ్విన్ను ఇలా సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ తీసుకోకుండా జాగ్రత్తపడేవాడని చెప్పుకొచ్చాడు.